Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Komdala Thattu Nea Gorkethoda Naadu

కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు

Komdala Thattu Nea Gorkethoda Naadu

Lyricist: Mallela David
Chorus
కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ
సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స
హాయంబు కలుగును‖ గొండల ‖
Verse
ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ
దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ‖ గొండల ‖
Verse
నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా
పాడు వాఁడు కున్కఁడు‖ కొండల ‖
Verse
నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు
నీకు నీడగా నగుఁ‖ కొండల ‖
Verse
ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను
మార్కొనంగఁ జాలవు‖ కొండల ‖
Verse
ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ
గాచును నీ ప్రాణముఁ గాపాడును‖ కొండల ‖
Verse
మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు
నిను యెహోవా కాచును‖ కొండల ‖
Verse
జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు
యుగ ముల కగుఁ గా కామేన్‖ కొండల ‖

Related Tags

PsalmProtectionGods Help