Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kondala Thattu Kannuletthuchunnaanu

కొండల తట్టు కన్నులెత్తుచున్నాను

Kondala Thattu Kannuletthuchunnaanu

Verse
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను
నాకు సాయమెచ్చట నుండి వచ్చును
Verse
భూమి యాకాశముల సృజించిన
యెహోవా వలన సాయము కల్గున్‖ కొండల ‖
Verse
నీ పాదము తొట్రిల్ల నీయడు
నిన్ను కాపాడువాడు కునుకడు‖ కొండల ‖
Verse
ఇశ్రాయేలును కాచు దేవుడు
కునుకడు నిద్రపోడు యెన్నడు‖ కొండల ‖
Verse
యెహోవాయే నిన్ను కాపాడును
కుడి ప్రక్క నీడగా నుండును‖ కొండల ‖
Verse
పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ
నీకు తగులకుండ కాపాడును‖ కొండల ‖
Verse
ఎట్టి అపాయమైన రాకుండ
ఆయన నీ ప్రాణము కాపాడున్‖ కొండల ‖
Verse
ఇది మొదలుకొని నిత్యము నీ
రాకపోకలందు నిను కాపాడున్‖ కొండల ‖

Related Tags

PsalmProtectionGods Help