Verse
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను‖ 2x ‖
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును‖ 2x ‖
యెహోవా వలనే – యెహోవా వలనే
నాకు సహాయం కలుగును – కలుగును 2x కలుగును‖ 2x కలుగును ‖
Verse
భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా
నా పాదంబులను – తొట్రిల్లనీయడు‖ 2x ‖
నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు‖ 2x ‖
యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును‖ 2x యెహోవా ‖
Verse
నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక‖ 2x ‖
ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును‖ 2x ‖
నా రాకపోకలయందును – కాపాడి రక్షించును‖ 2x యెహోవా ‖
Verse
వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా
నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా‖ 2x ‖
నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా‖ 2x ‖
నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా‖ 2x యెహోవా ‖