Verse
కొండలలో కోనలలో
బేతలేము గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో‖ 2x కొండలలో ‖
Verse
కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో‖ 2x ‖
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర‖ 2x ‖
దూతా గానము
శ్రావ్యా రాగము‖ 2x ‖
పరమ గీతము‖ కొండలలో ‖
Verse
దావీదు పురమందున
పశువుల శాలయందున‖ 2x ‖
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు‖ 2x ‖
రండి వేగమే
రండి శీఘ్రమే‖ 2x ‖
తరలి వేగమే‖ కొండలలో ‖