Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kondharemo Gurralantu Kondharemo Rathalantu Abburanga Athishayapadatharu

కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు

Kondharemo Gurralantu Kondharemo Rathalantu Abburanga Athishayapadatharu

Lyricist: Bro Anil Kumar
Verse
కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబ్బురంగా అతిశయపడతారు
కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారూ
మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం
కేడెమై ఆధారమై తల ఎత్తే దైవం
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా
లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా
భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు
రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే
ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు
ఉనికిలో ఉన్న జీవం అంతా ప్రభునిదే
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా
లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా
Verse
శాపగ్రస్తమైనట్టి సొదమ్మా రాజు అబ్రహాముకు ఆస్తినిచ్చి గొప్ప చేయ చూచెనుగా
ఒక్క నూలుపోగైనా నీది నాకు వద్దంటూ నీవే నన్ను గొప్పజెశావన్న మాట రావద్దంటూ
పిలిచినట్టి తన దేవునే మ్రోక్కేనే అబ్రహాము వాగ్ధాన ఫలముకై ఎదురు చూచుచుండే
అబ్రామా నీ బహుమానం అత్యధికమౌను భయపడకు నేనున్నాను నీ కేడెము నేను
అని ప్రభువు నిబంధన చేసేనుగా సమస్త రాజుల కంటే గొప్ప జేసెనుగా
అనేక జనాన్గామునకు తండ్రిని జేసెనుగా
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా
లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా
Verse
ఐగుప్తీయ సిరి కంటే క్రీస్తు విషయమై నిందా గొప్పదైన భాగ్యమంటూ ఎంచినాడు మోషే
అల్పకాల భోగాలు ఫరో రాజ్య యోగాలు వద్దొదంటూ కోట వీడి సహోదరుల శ్రమలను చూచే
మండుచున్న పొద మధ్యన ఉన్నవాడు కనిపించే దాస స్రుంకలను తెంచెను
తన వాక్కు నిచ్చి పంపే
ఐగుప్తు గుర్రపు రథముల బలమంతా తన ప్రజలను ఆరాధనకై తన కొండకు నడిపించా
మోషేను దేవుడు నిలిపెనుగా
ఫరోకు దేవుడుగా ప్రభు మోషే నుంచెనుగా చరిత్రలో నిలిచే నాయకునిగా చేసెనుగా
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా
లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా
Verse
మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటేను యెహోవాను ఆశ్రయించి నమ్ముకొనుట మేలు
సింహ పిల్లలకు అయినా లేమి కలుగుతుందేమో మనకు మాత్రం ఏ మేలు కొదువై యుండనేరదు
బల పరాక్రమము లన్నియు మన ప్రభుని చేతి దానములే
ఐశ్వర్యము గొప్ప ధనము కలిగేది ప్రభుని వల్లే
లోకాన ఘనులను మించే బహుమంచి పేరు రాజులనే శాసించేటి తన ఆత్మా హోరు
మనకిపుడు ఇచ్చునుగా ప్రభువు
మనలను జ్ఞానముతో ప్రభు నిత్యము నింపునుగా సూచన మాహత్కార్యముగా మననుంచెనుగా
ప్రభువు ఒక్కడే చాలన్న గెలుపు మనదే నన్నా
ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా
లలలలలా లలలా లలలలలా లల్ల లలలలలా లలలా లలలలలా

Related Tags

PraiseWorshipTrust