Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Koniyaada Dharame Ninnu Komala Hrudaya

కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ

Koniyaada Dharame Ninnu Komala Hrudaya

Lyricist: Vanthagani Paradesi
Chorus
కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను
తనరారు దినకరుఁ బెనుతారలను మించు ఘనతేజమున నొప్పు
కాంతిమంతుఁడ వీవు‖ కొనియాడ ‖
Verse
ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు నురుతరంబుగఁ గొలువ
నొప్పు శ్రేష్ఠుఁడ వీవు‖ కొనియాడ ‖
Verse
సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి
వీవు‖ కొనియాడ ‖
Verse
విశ్వమంతయు నేలు వీరాసనుఁడ వయ్యుఁ పశ్వాళితోఁ దొట్టిఁ
పండియుంటివి నీవు‖ కొనియాడ ‖
Verse
దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి యేసు పేరున జగతి
కేగుదెంచితి నీవు‖ కొనియాడ ‖
Verse
నరులయందునఁ గరుణ ధర సమాధానంబు చీకాలమును మహిమ
పరఁగఁ జేయుదు వీవు‖ కొనియాడ ‖
Verse
ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని శ్రేయముగ బవళించు శ్రీకర
వరసుత‖ కొనియాడ ‖

Related Tags

WorshipChristmas