Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Koniyaada Tharame Ninnu

కొనియాడ తరమే నిన్ను

Koniyaada Tharame Ninnu

Verse
కొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను
తనరారు దినకరు – బెను తారలను మించు‖ 2x ‖
ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు‖ కొనియాడ ‖
కెరుబులు సెరుపులు – మరి దూత గణములు‖ 2x ‖
నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు‖ కొనియాడ ‖
సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు‖ 2x ‖
నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు‖ కొనియాడ ‖
విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు‖ 2x ‖
పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు‖ కొనియాడ ‖
దోసంబులను మడియు – దాసాళి కరుణించి‖ 2x ‖
యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు‖ కొనియాడ ‖
నరులయందున కరుణ – ధర సమాధానంబు‖ 2x ‖
చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు‖ కొనియాడ ‖
ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని‖ 2x ‖
శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత‖ కొనియాడ ‖

Related Tags

PraiseWorshipJesus