Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Koniyaadi Paadi Keerthinchi Varninchedha Ninu Naa Prabhuvaa

కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా

Koniyaadi Paadi Keerthinchi Varninchedha Ninu Naa Prabhuvaa

Verse
కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా
Verse
పరిశుద్ధుడవు నీతిమంతుడవు
పాపపు వస్త్రము మార్చిన దేవ
ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి
పొగడెద నిన్ను ధవళవర్ణుడా
Verse
తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి
బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను నీ ఘనవిజయము
భరియించెద నిన్ను రత్నవర్ణుడా
Verse
గుర్తించెద నిన్ను ఘనముగా నేను
ఘనుడా నాకు ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా
పరికించి నిన్ను పాడి స్తుతించెద
Verse
ఆరాధించెద ప్రభువా దేవా
ఆత్మతోను సత్యముతోను
తిరిగి రానై యున్న ప్రభువా
స్తుతియు ఘనత మహిమయు నీకే

Related Tags

PraiseWorship