Verse
కొంత సేపు కనబడి - అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిది రా ఈ జీవితం - లోకాన కాదేదీ శాశ్వతం‖ 2x ‖
ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువదు‖ 2x ‖
Verse
ఎదురౌ తారెందరో నీ పయనం లో
నిలిచేది ఎందరూ నీ అక్కరలో
వచ్చేదేవరూ నీతో మరణం వరకు‖ 2x ‖
ఇచ్చేదేవరూ ఆపై నిత్య జీవము నీకు‖ ఏసే ‖
Verse
చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి యున్నదా
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణ మడిగితే‖ 2x ‖
సంపాదన ఎవరిదగును యోచించితివా‖ ఏసే ‖
Verse
నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యం నీకై సిద్దం చేసి
విశ్రాంతి నియ్యగా నిన్ను పిలువగా‖ 2x ‖
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొండువా‖ ఏసే ‖