Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kontha Yedamu Neevainaa

కొంత యెడము నీవైనా

Kontha Yedamu Neevainaa

Lyricist: Sayaram Gattu
Verse
కొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా
Verse
మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు‖ 2x ‖
ప్రేమను పంచే ప్రేమ రూపుడా‖ 2x ‖
మరియొక్క మారు మన్నించు విభుడా‖ 2x కొంత యెడము ‖
Verse
కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము‖ 2x ‖
కమ్మిన పొరలు కరిగించుటకు‖ 2x ‖
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు‖ 2x కొంత యెడము ‖
Verse
మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము‖ 2x ‖
నిరతము స్థిరముగ నున్న అక్షయుడా‖ 2x ‖
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా‖ 2x కొంత యెడము ‖
Verse
మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి‖ 2x ‖
నను వరియించగ రానున్న ప్రియుడా‖ 2x ‖
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా‖ 2x కొంత యెడము ‖

Related Tags

WorshipDevotionalRepentance