Verse
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం
లోకాన కాదేది శాశ్వతం‖ 2x ‖
యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు‖ 2x కొంతసేపు ‖
Verse
ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో‖ 2x ‖
వచ్చేదెవరు నీతో మరణము వరకు‖ 2x ‖
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు‖ యేసే ‖
Verse
చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా‖ 2x ‖
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే‖ 2x ‖
సంపాదన ఎవరిదగును యోచించితివా‖ యేసే ‖
Verse
నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి‖ 2x ‖
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా‖ 2x ‖
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా‖ యేసే ‖