Chorus
కొనుము మా హృదయంబు లను నీకర్పించెద మనయము నుతి
యించుచు ఘనముగాఁ గృపచేత మముఁ గా చినను మే మెంతయు
ననర్హుల మనుచు నీ పాదముల కెరగుచు ననిశమును నీ కృపఁ
తలంతుము‖ కొనుము ‖
Verse
బలహీనులము మేము బలవంతుఁడవు నీవు బల మిచ్చి మము
నడుపుము ఇలను మే మిఁక బ్రతుకు దివనం బులను నీ పద భక్తిచే
నెపుడలయ కుండగ మమ్ముఁ గడు ని ర్మలిన హృదయులఁ జేసి కరుణను‖ కొనుము ‖
Verse
ఘోరారణ్యము భువి వి చార సంకలితము భూరి భయంకరము దారి
లేదిఁక నీవు దప్ప వేరె సాధన మెచెటఁ గానము కోరి మము నందరిని
నీదరి జేరుకొను మార్గమును జూపు‖ కొనుము ‖
Verse
గత వత్సరమున నీ యతులమౌ కృపచేత పతితుల మముఁ గాచితి
వతి వినమ్రుల మగుచు మామా మతులలో నీ ప్రేమఁ దలఁచుచు మతి
విహీనతే వీడి యిఁక నిను సతతతము సేవింతు మయ్య‖ కొనుము ‖
Verse
ఈ వత్సరంబున నెవ్వరు మాలోన పోవుదు రిలను విడిచి దేవ
వారలు భువిని వదలి పోవు కాలమునందుఁ దిన్నని త్రోవలో వారలను
సుఖముగఁ బ్రోవఁ దొడ్కొని పోవు మయ్య‖ కొనుము ‖
Verse
మమ్మును విశ్వాస మార్గమందున దోడ నిమ్ముగఁ గొని పోవుచు
నమ్ము నీ ప్రియ సేవకుల బృం దమ్మునకు సిద్ధంబులగు మకు టమ్ములను
మే మొందుటకు వే గమ్ముగాఁ బాత్రులను జేసి‖ కొనుము ‖
Verse
శోధనల యందున బాధల యందున నోదార్పు మా కొసఁగుము
శోధనలచే మాకు మరియును శుద్ధమగు హృదయంబు లిచ్చుచు శోధనల్
ఫలియిపంఁ జేయుము బాధకమ్ములు గాక యుండఁ‖ కొనుము ‖
Verse
ఈ లోక దుఃఖము లెల్ల నేగిన పిదప నీ లోకమును జేరఁగఁ
పాలుమాలక మేము మామా పరుగు నెత్తఁగు సాయ మిమ్మో యేలికా నీ
కరములను మ మ్మెపుడు గొని నడువంగ నేర్పు‖ కొనుము ‖
Verse
దురితంబు లెల్లను గరుణచేఁ గడిగి నీ పరమందు మము జేర్పుము
నిరతమును మే మచట నీ కృప విరివి నెంతయు బొగడుచును మా
కరములను బంగారు వీణెల వెరవుగాఁ గొని మీటుచుందుము‖ కొనుము ‖