Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Koodikoni Yunnaamu Sangha Prabho Koo

కూడికొని యున్నాము సంఘ ప్రభో కూ

Koodikoni Yunnaamu Sangha Prabho Koo

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ
నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి‖ కూడికొని ‖
Verse
ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి
విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు
మీ యేసు క్రీస్తునాధా‖ కూడికొని ‖
Verse
గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ
గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి
శాంతి నిడితివి యాత్మస్వరూపా‖ కూడికొని ‖
Verse
నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ
గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము
దేవుని ప్రియ తనయా‖ కూడికొని ‖
Verse
అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి
నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు
ప్రభు యేసు క్రీస్తు‖ కూడికొని ‖
Verse
అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు
నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు
వేగంబు మా తండ్రీ‖ కూడికొని ‖

Related Tags

WorshipPrayerFellowship