Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Koorchundunu Nee Sannidhilo

కూర్చుందును నీ సన్నిధిలో

Koorchundunu Nee Sannidhilo

Verse
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం‖ 2x ‖
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను‖ కూర్చుందును ‖
ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా‖ 2x ‖
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా‖ 2x ‖
నీ నామమునే హెచ్చించెదా‖ 2x ‖
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..‖ కూర్చుందును ‖
ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా‖ 2x ‖
నీ వాక్యానుసారము జీవించెదా‖ 2x ‖
నీ ఘన కీర్తిని వివరించెదా‖ 2x ‖
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..‖ కూర్చుందును ‖

Related Tags

WorshipPrayerDevotion