Chorus
కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర
గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ‖ కోఁత ‖
Verse
నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక
యేటి గ్రాసము నీ దినంబున గాంతురు‖ కోఁత ‖
Verse
విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి
మాకతి క్షేమ మొసఁగితి రక్షకా‖ కోఁత ‖
Verse
వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ
మొక్కయి బయలువడె నిది చిత్రము‖ కోఁత ‖
Verse
జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని
శక్తి చేతను బాగుగను ఫలియించెను‖ కోఁత ‖
Verse
ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు
మహిమను నందఁ జేయుము రక్షకా‖ కోఁత ‖
Verse
కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ
జేయుము ప్రీతిగల మా రక్షకా‖ కోఁత ‖
Verse
దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ
మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు‖ కోఁత ‖
Verse
లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున
దండ్రి మింటను నేకముగ జీవింతుము‖ కోఁత ‖
Verse
నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు
భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ‖ కోఁత ‖
Verse
మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ
భో జనము వేఁడఁ నీయుమీ‖ కోఁత ‖
Verse
వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు
నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్‖ కోఁత ‖