Chorus
కోప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును శ్రీ పాల
యేసుని దాపునఁ జేరక మాపు రేపులు మహ పాపులకును గొప్ప కోప‖ కోప ‖
Verse
భువిలో రాల కర్రల పూజలఁజేయు చవి దేవుండ్లని చెప్పెడి అవిగాక
తమవంటి నరులదేవుండ్లని యవివేకముగ నమ్ము నరులందరికి
నెంతో కోప‖ కోప ‖
Verse
నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరి యబద్ధికు లందఱు
ఇరుగు పొరుగు వారి నిఁక మోసములు చేయు నరులందఱు చెడ్డ
నరకములోఁ బడునట్టి కోప‖ కోప ‖
Verse
ఆట పాటలవల్లను పాపము చాల వేటాడుకొను వారలు బూట
కముల వారలు భువిలో యక్షిణిగాండ్రు మాటలాడక యగ్ని మడుగులో
బడి కాలే కోప‖ కోప ‖
Verse
కులభేదములు గల్పించి కుటిలమందు బలముగ బ్రతుకుచుండు
ఇల మాయవాదుల కిఁక నేమి గతిలేక పలుగొరుకులు నుండె బాధల
పాలయ్యెడు కోప‖ కోప ‖
Verse
మీఁది దేవునివలనను యియ్యంబడెడు వేద మొక్కటి సత్యము
ఆధారమైయుండు నాత్మరక్షణ కది సాధులైనమ్మని భేదకులకు నెంతో కోప‖ కోప ‖