Verse
కోరితి నీ సన్నిదానం చేరితి నీ సన్నిదానం
కడవరకు నాకు తోడుగ ఉండాలని
Verse
నీ పాదసేవ చేయాలన నిన్నే నేను చూడాలని
మనసార నిన్నె కోరితి నా ప్రభువ
Verse
పాపికి ఆశ్రయం నీవేనని
పరముకు మార్గము నీలోనని
ప్రేమతో నిన్నే కోరితి యేసయ్యా
Verse
చావైన బ్రతుకైన నీవేనని
బ్రతికితే నీ సేవ చేయాలని
నిన్నే నేను కోరితి నా దేవా