Chorus
కోరుకొని యున్నాము యేసు ప్రభూ కోరుకొని యున్నాము సార
కల్యాణ గుణమణి సన్నిధి‖ కోరుకొని ‖
Verse
చారు వివాహో త్సవము ఘనముగఁ జేయఁ గోరి దర్శన మి
చ్చితివి గనుకఁ గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకుఁ గారపు
చుట్టము గా నిన్ను యేసూ‖ కోరుకొని ‖
Verse
కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల
మీఁద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ
మును నీవే దీవింపఁ‖ కోరుకొని ‖
Verse
చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు
లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల
మే ళన నీవు దయచేయఁ‖ కోరుకొని ‖
Verse
ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందుఁ దనర నొకరి కొకరు దయఁ
జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసారఁ దత్సంత
తిని గాన డయచేయఁ‖ కోరుకొని ‖