Chorus
నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది?‖ 2x ‖
ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల?‖ 1x ‖
ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల?‖ 1x ‖
మేల్కో - లెమ్ము - రారమ్ము విశ్వాసి‖ 2x 1x ‖
Verse
అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో‖ 2x ‖
అన్నింటి సహించుచు - ఆత్మలాదాయము చేసిరి‖ 1x ‖
Verse
రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి
పరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి
Verse
కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి
చెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు
Verse
సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరి
సువార్త ప్రభలమాయె - సంఘము - స్థాపించబడె
Verse
కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరే
యేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్
Verse
అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో
నా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను