Verse
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం‖ 2x ‖
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి‖ 2x క్రైస్తవ ‖
Verse
ఈ లోక ఘనత నన్ను విడిచినన్
లోకస్థులెల్లరు నన్ను విడిచినన్‖ 2x ‖
నా సహోదరులు నన్ను విడిచినన్
యోసేపు దేవుడే నా సహకారి‖ 2x క్రైస్తవ ‖
Verse
అంధకారంబు భువి నావరించిన
రాజులు ఘనులు శత్రువులైనను‖ 2x ‖
అగ్ని గుండములో సింహపు బోనులో
దానియేలు దేవుడే నా సహకారి‖ 2x క్రైస్తవ ‖
Verse
నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహాయకుడు‖ 2x ‖
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్‖ 2x క్రైస్తవ ‖
Verse
బూర శబ్దంబు మ్రోగెడి వేళ
శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్‖ 2x ‖
ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్‖ 2x క్రైస్తవ ‖