Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kraisthava Jeevitham Saubhagya Jeevitham Prabhu Pillalaku Entho Aanandam

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం

Kraisthava Jeevitham Saubhagya Jeevitham Prabhu Pillalaku Entho Aanandam

Chorus
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం
Verse
కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన
యేసు ప్రభువే నా సహకారి
Verse
ఈ లోక ఘనత నన్ను విడచినన్
లోకస్థులెల్లరు నన్ను విడచినన్
నా సహోదరులు నన్ను విడచినన్
యోసేపు దేవుడే నా సహకారి
Verse
అంధకారంబు భువి నావరించిన
రాజులు ఘనులు శత్రువులైనను
అగ్నిగుండములో సింహపు బోనులో
దానియేలు దేవుడే నా సహకారి
Verse
నా మంచి కాపరి శ్రేష్ట స్నేహితుడు
శాశ్వత రాజు నా సహాయకుడు
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నేకీర్తించెదను
Verse
బూరశబ్దంబు మ్రోగెడివేళ
శ్రమలొందిన నా ప్రభుని చూచెదను
ఏనాడో ఎప్పుడో నీవు వచ్చెదవూ
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్

Related Tags

FaithChristian LifeJoy