Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kraisthavakarshaka Kadhiliraavayya Kana

క్రైస్తవకర్షక కదిలిరావయ్యా కన

Kraisthavakarshaka Kadhiliraavayya Kana

Chorus
క్రైస్తవకర్షక కదిలిరావయ్యా
కన్నులు తెరచి కానవేమయ్యా
Verse
మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును
విత్తెమున్న భూలోకంబనెడు పొలంబునందున
వాక్యంబనె విత్తనంబు విత్తెను‖ క్రైస్తవ ‖
Verse
ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు విత్తె
రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను
దానంబుజేసిరి‖ క్రైస్తవ ‖
Verse
చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము
గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు
కడవరి వర్షము కొరకు వేడుదం‖ క్రైస్తవ ‖
Verse
పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల
గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని
కోతవారిని పంప కోరివేడుదం‖ క్రైస్తవ ‖
Verse
శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె
గోధుమల మధ్య గురుగులు కూడ ఘోరంబుగాను
పెరుగుచుండెను‖ క్రైస్తవ ‖
Verse
కన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా కలవర మొందెద
వెందులకు సంతోషముతో సంగీతాలతోను
సాగిపోవుదుము ఆగిపోకను‖ క్రైస్తవ ‖

Related Tags

EvangelismHarvestMission