Verse
క్రైస్తవమొక మతము కాదిది
యేసునందు తిరిగి జన్మము
క్రీస్తునందు తిరిగి జన్మము‖ 2x ‖
Verse
ధరల తల్లి దానమొసగును
తన రక్తము ప్రతిజనలములో
అందరికి జీవమొసగెను
కలువరిలో యేసు రక్తము‖ 2x క్రైస్తవమొక ‖
Verse
ఒక జన్మకు రెండు చావులు
ఇరు జన్మలకొక్క మరణమే‖ 2x ‖
సిలువయందే నరకపు చావు
పొందెనేసు అందరికొరకు‖ 2x క్రైస్తవమొక ‖
Verse
భువికి మూలమీ శరీరము
దివిని చేర ఆత్మ మూలము‖ 2x ‖
మతము మార్గ జ్ఞానము వీడి
మరణ విజయుడేసు చేరుమా‖ 2x క్రైస్తవమొక ‖