Verse
క్రైస్తవుడా సైనికుడా
బలవంతుడా పరిశుద్ధుడా
కదలిరావోయ్ నీవు కదలిరా‖ 4x ‖
Verse
జాలరీ మనుషులు పట్టు జాలరి
ఆత్మలు పట్టు కాపరి
అమృతమందించే ఆచారి
యేసుకై జీవించే పూజారి‖ క్రైస్తవుడా ‖
Verse
సిలువే నీ స్థావరము
శ్రమలే నీ సైన్యము‖ 2x ‖
సహనమే నీ ధైర్యము
వాక్యమే నీ విజయము‖ 2x క్రైస్తవుడా ‖
Verse
సత్యమే నీ గమ్యము
సమర్పణే నీ శీలము‖ 2x ‖
యేసే నీ కార్యక్రమం
ప్రేమే నీ పరాక్రమం‖ 2x క్రైస్తవుడా ‖
Verse
దేశంలో విదేశంలో
గ్రామంలో కుగ్రామంలో‖ 2x ‖
అడవులలో కొండలలో
పని ఎంతో ఫలమెంతో‖ 2x క్రైస్తవుడా ‖
Verse
సిద్ధాంతపు గట్టు దుమికి రా
వాగులనే మెట్టును దిగిరా‖ 2x ‖
దీనుడా ధన్యుడా
విజేయుడా అజేయుడా‖ 2x క్రైస్తవుడా ‖
Verse
వాగ్ధాన భూమి స్వతంత్రించుకో
అద్వానపు అడవి దాటి ముందుకుపో‖ 2x ‖
నీ ఇల్లు పెనూయేలు
నీ పేరే ఇశ్రాయేలు‖ 2x క్రైస్తవుడా ‖