Verse
క్రైస్తవులారా! లెండి యీనాడు
క్రీస్తు పుట్టెనంచు పాడుఁడి;
ప్రసన్నుఁడైన తండ్రి ప్రేమను
ఆసక్తిపరులై కీర్తించుఁడి
క్రీస్తేను మానవాళితోడను
నశింపవచ్చెనంచు పాడుఁడి.
Verse
దేవుని దూత గొల్లవారికి
ఈ రీతిగాను ప్రకతించెనుః
'ఈ వేళ మహా సంతోషంబగు
సువార్త నేను ఎరిగింతును.
దావీదు పట్నమం దీదినము
దైవరక్షకుఁడు జన్మించెను.'
Verse
త్వరగానే ఆకాశ సైన్యము
హర్షించుచు నీలాగు పాడెను
'సర్వోన్న తాకాశంబునందుండు
సర్వేశ్వరునికి ప్రభావము
నరులయందు సమాధానము
ధరణిలో వ్యాపింపనియ్యుఁడు'.
Verse
పరమతండ్రి దయారసము
నరులకెంతో నాశ్చర్యము
నరావతారుఁడగు దేవుఁడు
నిరపరాధిగాను జీవించి
నిర్దోషమైన త్రోవ చూపించి
విరోధులన్ ప్రేమించుచుండెను.
Verse
శ్రీ మాత సైన్యముతో మేమును
వాద్యములు వాయించుచుందుము;
ఈ దినమందు నుద్భవించిన
యా దివ్యకర్తను వీక్షింతుము;
సదయుఁడైన యేసు ప్రేమను
సదా స్తుతించి పాడుచుందుము.