Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthae Ee Jeevithamuloa Emthaina Manchikaapari

క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి

Kreesthae Ee Jeevithamuloa Emthaina Manchikaapari

Chorus
క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి
దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు
Verse
కష్టబాధలలో మన ప్రభువు
నమీపముగా నుండెనెంతో
గాలితుఫానులను గద్దించుచు
మనతో నుండు యాత్రలో
Verse
ఇహలోక సాగరము దాటునప్పుడు
అలలెంతో మనలను కదిలింపగా
మునుగు నప్పుడు మొరపెట్టిన
మనల రక్షంచు తానే
Verse
జీవిత నావపై దాడి చేసే
సాతాను క్రియలకు భయపడక
ధైర్యము కొరకై ప్రార్థించిన
ప్రభువే మనల నడుపున్
Verse
జీవితములో నిరాశచే
కృంగిపోయి మనమున్నప్పుడు
విజయము నిచ్చి బలపరచి
జీవకిరీట మిచ్చును
Verse
యేసు ప్రభువే మన దుర్గము
ఆయన యందే నిలిచినచో
నిశ్చయముగ జయింతుము
ఓడిపోవును శత్రువు

Related Tags

ComfortProtectionGuidanceShepherd