Chorus
క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధారి‖ క్రీ ‖
Verse
ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత
భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన‖ క్రీ ‖
Verse
దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి
దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన‖ క్రీ ‖
Verse
శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి
శాప భారంబు మోసి శ్రమల సహించెగాన‖ క్రీ ‖
Verse
సైతాను జనము గూల్పన్ పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప రుధిరంబు గార్చెగాన‖ క్రీ ‖
Verse
మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్
మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన‖ క్రీ ‖
Verse
పరమందు దివిజులైన ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన‖ క్రీ ‖
Verse
ఈ నామమునకు మించు నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన‖ క్రీ ‖