Chorus
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ
ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే
Verse
మనల రక్షింపనెంచి - సిలువలో ప్రణమిచ్చె
తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె
Verse
నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండే
నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే
Verse
ఆయన ప్రక్షత్యత - ప్రేమించు వారి కొరకు
ప్రభు తిరిగి వచ్చుచుండే - పరలోక మహిమతోడ
Verse
ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరశుద్ధ పరచబడెనో
వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల
Verse
ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్
బహుమానములుగ మారి - కంతికిరీత మౌను
Verse
ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు
పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ