Verse
క్రీస్తేసు శక్తినామమెల్లరు కీర్తించి కొల్వుడిలన్ యెపుడు కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి‖ క్రీస్తే ‖
Verse
సాష్టాంగపడి దూతల్ పరమున నిష్ఠతో గొలుచుచును యేసుని కీర్తి
కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి‖ క్రీస్తే ‖
Verse
హతసాక్ష్యపు జనమా యేసుడె హితమతితో బిలుచున్ మిమ్ముల కీర్తి
కిరీటము ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి‖ క్రీస్తే ‖
Verse
ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను ఆశ్రయ రక్షణను యేసుడే కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి‖ క్రీస్తే ‖
Verse
పాపుల రక్షించెన్ సిలువపై శాపము దొలగించెన్ యేసుడే కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి‖ క్రీస్తే ‖
Verse
సర్వజనంబులారా క్రీస్తుని సర్వజగంబులలో ఠీవిగ కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తే రారాజనుడి‖ క్రీస్తే ‖
Verse
పరమందున్నట్టి ప్రభుదగు పరిశుద్ధ సంఘముతో మనము కీర్తి కిరీటము
ధరియింప జేయుడి క్రీస్తు నారాధింతము‖ క్రీస్తే ‖