Chorus
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి - ఆయన కృపయందే నిలుచుండుము
పరలోక మహిమ కిరీటముకై - క్రీస్తేసు అడుగులలో నడువుము
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచు
Verse
సమాదాన దేశం పరలోకము - ఎన్నో దీవెనలు కలవందున
ఇహలోక శాంతి క్షణమాత్రమే - గొప్ప శిక్ష యందు దాగియుండె
Verse
క్రీస్తు నుండి నిన్ను దూరపరచ - లోకాశలు నిన్ను ఆకర్షించు
సిలువను చూడక పోయినచో - చిక్కుకొనెదవు ఈ లోకములో
Verse
ప్రభుయేసు సహవాసమున నిలిచి - సాతానుకు స్థలమియ్యకుము
ఏవి క్రీస్తునుండి విడదీయునో - యేసు రక్తమందు కడుగుకొనుము
Verse
పరలోక దీవెనలు రుచిచూడను - ఆశతో వెళ్ళను సిద్ధపడు
లోకమునకు నీవు వేరైనచో - ఆత్మీయముగ నీవు యెదిగెదవు