Verse
క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి‖ క్రీస్తే ‖
Verse
ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన‖ క్రీస్తే ‖
Verse
దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి
దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన‖ క్రీస్తే ‖
Verse
శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన‖ క్రీస్తే ‖
Verse
సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన‖ క్రీస్తే ‖
Verse
మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్
మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన‖ క్రీస్తే ‖
Verse
పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన‖ క్రీస్తే ‖
Verse
ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన‖ క్రీస్తే ‖