Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthesu Prabhuvu

క్రీస్తేసు ప్రభువు

Kreesthesu Prabhuvu

Lyricist: Songs Of Zion
Verse
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి
కొన్నట్టి సంఘమున
ఎవరు చేరెదరో వారే ధన్యులు
పరలోకము వారిది‖ 2x క్రీస్తేసు ‖
Verse
అపొస్తలుల బోధను నమ్మి
స్థిరపరచబడిన వారే‖ 2x ‖
ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు
సంఘములో నిలిచెదరు‖ 2x క్రీస్తేసు ‖
Verse
పరిశుద్ధులతో సహవాసమును
ఎవరు కలిగియుందురో‖ 2x ‖
వారే పొందెదరు క్షేమాభివృద్ధి
క్రీస్తేసు ప్రభువు నందు‖ 2x క్రీస్తేసు ‖
Verse
ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే
తన యందు నిలిచెదరు‖ 2x ‖
ప్రకటించెదరు ఆయన మరణ
పునరుత్తానమును వారు‖ 2x క్రీస్తేసు ‖
Verse
పట్టు వదలక సంఘముతో కూడి
ఎవరు ప్రార్ధించెదరో‖ 2x ‖
ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు
బంధించెదరు వారే‖ 2x క్రీస్తేసు ‖
Verse
క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు
ఎవరెదురు చూచెదరో‖ 2x ‖
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు
సర్వ లోకము నందు‖ 2x క్రీస్తేసు ‖

Related Tags

Second ComingPrayerSalvationChurchCommunion