Verse
క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..
పశులపాక పావనమై.. పరవశించెనుగా…
పరవశించెనుగా…
Verse
క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా
పశులపాక పావనమై పరవశించెనుగా
గొర్రెల కాపరులు సంతోషముతో
గంతులు వేసెను ఆనందముతో‖ 2x ‖
తూర్పు దిక్కున చుక్క వెలిసెను
లోక రక్షకుడు భువికి వచ్చెను‖ 2x క్రీస్తేసు ‖
Verse
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
Verse
ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను
చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను‖ 2x ‖
పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే
ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి‖ 2x తూర్పు దిక్కున ‖
Verse
సంతోషము సమాధానము కృపా కనికరము
మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము‖ 2x ‖
సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి
బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి‖ 2x తూర్పు దిక్కున ‖