Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthu Chemthaku Rammu Priyudaa Yaesu Chemthaku Rammu Priyudaa

క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా

Kreesthu Chemthaku Rammu Priyudaa Yaesu Chemthaku Rammu Priyudaa

Chorus
క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా
యేసు చెంతకు రమ్ము ప్రియుడా
జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్
Verse
ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చును
నీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవు
యుగ యుగములవరకు
Verse
ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చును
జీవాహారము భుజించిన - ఆకలిగొనవెప్పుడు
యుగ యుగములవరకు
Verse
ఆయనే జీవ మార్గము - స్వర్గరాజ్యమును చేరను
ఆయన నంగీకరించిన - తండ్రియొద్దకు చేరెదవు
యుగములు రాజ్య మేలను
Verse
ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను
నీ వందు ప్రవేశించిన - చేరుదువు నిశ్చయముగ
నిత్యసుఖము లొందెదవు
Verse
ఆయనే నిత్య సత్యము - సర్వలోకమును రక్షింప
ఆయనను స్వీకరించిన - నిత్య శిక్షనుండి తప్పించున్
సదా ఆయనతో నుందువు

Related Tags

InvitationGospelSalvation