Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthu Laechenu Hallelooya Kreesa

క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస

Kreesthu Laechenu Hallelooya Kreesa

Lyricist: B Surya Prakasa Rao
Verse
క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్నులేపును ఇద్దియె సునాద సత్యము
ఇలను చాటుడి నిత్యము‖ నిత్యము ‖
Verse
మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు
లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది‖ నిజమిది ‖
Verse
పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను పాపినగు నను బ్రోవ
క్రీస్తుని ప్రాణదాన ప్రభావము‖ ప్రభావము ‖
Verse
మరణమా! నీముల్లు యెక్కడ? మరణమా! జయమెక్కడ? మరణమా!
నీముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు‖ నిప్పుడు ‖
Verse
శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలాయెను రాత్రిలో ఇలయు
పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో‖ క్రీస్తులో ‖
Verse
మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము ప్రేతలను
జీవింపచేయును పృథివి క్రీస్తుని విజయము‖ విజయము ‖
Verse
స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా స్వంత
రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి‖ యంజలి ‖

Related Tags

PraiseResurrectionEaster