Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthu Mimmulanu Svathanthrula Jaese Dhaasyapu Kaadiki Chikkukonaku

క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె దాస్యపు కాడికి చిక్కుకొనకు

Kreesthu Mimmulanu Svathanthrula Jaese Dhaasyapu Kaadiki Chikkukonaku

Verse 1
Reference: క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు గలతీ Galatians 5:1
Chorus
క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె
దాస్యపు కాడికి చిక్కుకొనకు
Verse
నీవు ఈ లోకములో నున్నను - కాని ఈ లోకమునకు జెందవు
లోకముతో ఏకీభవించకు లోకపు కాడికి చేరకుము
Verse
నీ శరీరేచ్ఛ దురాశలను సిలువపైన అంత మొందించు
పరిశుద్ధాత్మచే నడిపింపబడి శరీర ఆశల నెరవేర్చకు
Verse
దేవుని వాత్సల్యమును పరిశుద్ధముగా మీ శరీరములన్
అనుకూల సజీవ యాగముగ అర్పించుకొనుడి ప్రభువునకే
Verse
మీరు క్రీస్తుతో లేపబడిన పైనున్న వాటినే వెదకుడి
లోకమునకు మీరు మరణించి పరలోక వాటినే ప్రేమించుడి

Related Tags

HolinessSurrenderFreedom