Verse
క్రీస్తు నేడు లేచెను - మర్త్య దూత సంఘమా
భూమి నాకాసంబులో - బాడు విందుచేతను
Verse
మోక్ష మియ్య నాథుదు - యుద్ధమాడి గెల్చెను
సూర్యుడుద్భవింపగ - జీకటుల్ గతించెను
Verse
బండ, ముద్ర, కావలి - అన్ని వ్యర్థమైనవి
యేసు నరకంబును - గెల్చి ముక్తి దెచ్చెను
Verse
క్రీస్తు లేచినప్పుడు - చావు ముల్లు త్రుంచెను
ఎల్లవారి బ్రోచును - మృత్యు వింక గెల్వదు
Verse
యేసు మృతి గెల్చెను - మేము కూడ గెల్తుము
యేసుడుండు చోటుకు - మేము కీడబోదుము
Verse
భూమి నాకాసంబులో - యేసు, నీకు స్తోత్రము
మృత్యు సంహారకుండ - నీకేను విజయము