Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthu Prabhuni Prathyakshathalanu

క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను

Kreesthu Prabhuni Prathyakshathalanu

Lyricist: Mallela David
Chorus
క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ రించెద వినరే ప్రియులార వాస్తవముగ
మరణించి బ్రతికెనని వసుధలోఁ బ్రకటింపరె యూరూరఁ‖ క్రీస్తు ‖
Verse
మరియ మగ్దలేనెకుఁ బ్రథమంబున మన గురువర్యుం డగపడియెఁ
తరుణీమణులకు రెండవ మాఱొక దర్శనము దయతో నిడియెఁ‖ క్రీస్తు ‖
Verse
సీమో నను పేతురును గూడ ద ర్శించె నతఁడు మూఁడవ మాఱు
ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుఁ బ్రియ మొనరించె మఱొక తీఱు‖ క్రీస్తు ‖
Verse
తోమాలేని తరుణమునఁ బదుగురి తో వచించె గృహమునఁ జేరి
తోమాకు కనపడి యతని సంశయముఁ దొలఁగించెను బ్రభుఁ డొకసారి‖ క్రీస్తు ‖
Verse
సందరంపు దరి నేడుగురికి మ త్స్యంబులు వింతగ సమకూర్చె
సందర్శించియు యాకోబునకును సంతోషము నెంతయుఁ గూర్చెఁ‖ క్రీస్తు ‖
Verse
ప్రభుఁ డొక మాఱే నూరుగురిఁ దాఁ బ్రత్యక్షుం డయ్యెను పేర్మి నషయ
మొసంగి యపొస్తలులకుఁ క్రీ స్తారోహణుఁ డయ్యెను గూర్మిఁ‖ క్రీస్తు ‖
Verse
హత్యఁ జేయు నేగెడు తార్సీయున కగపడి రక్షించెను సుమ్ము
మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో దృశ్యుం డగు నిది సత్యమ్ము‖ క్రీస్తు ‖

Related Tags

JesusResurrection