Verse
క్రీస్తు పుట్టెను హల్లెలూయా‖ 2x ‖
జగమంతా పండుగాయెను – సర్వలోకానికి సందడాయెను‖ 2x ‖
చీకు చింత వీడిపోయె – చీకటంత తొలగిపోయె‖ 2x ‖
నవ్యకాంతులెగసె ఇలలో – దివ్యకాంతుడేసు రాకతో…
ఉల్లాసమే ఉత్సాహమే – జగమంతా జయోత్సాహమే‖ 2x ‖
Verse
చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య
పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను
ఆ ఇంటిలో – రక్షణకాంతులే విరజిల్లెను‖ 2x చీకు చింత ‖
Verse
గెరాసేను జనములలో కొందరు
రోగాలు దయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను
ఆ ఊరిలో – విడుదలకాంతులే ప్రకాశించెను‖ 2x చీకు చింత ‖
Verse
మరణమాయె యాయీరు కూతురు
వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను
ఆ ఇంటిలో – జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను‖ 2x చీకు చింత ‖
Verse
వేదనతో నలిగిపోవుచున్నావా
యేసు నీ కొరకై ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము
నీ ఇంటికి – వెలుగు వచ్చియున్నది‖ 2x క్రీస్తు పుట్టెను ‖