Verse
క్రీస్తు పుట్టెను పశుల పాకలో
పాపమంతయు రూపు మాపను
సర్వలోకమున్ విమోచింపను
రారాజు పుడమిపై జన్మించెను
సంతోషమే సమాధానమే
ఆనందమే పరమానందమే‖ 2x ‖
అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
యేసుని చూచి కానుకలిచ్చి
పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే
Verse
పరలోక దూతాలి పాట పాడగా
పామరుల హృదయాలు పరవశించగా‖ 2x ‖
అజ్ఞానము అదృష్యమాయెను
అంధకార బంధకములు తొలగిపోయెను‖ 2x ‖
Verse
కరుణగల రక్షకుడు ధర కేగెను
పరమును వీడి కడు దీనుడాయెను‖ 2x ‖
వరముల నొసగ పరమ తండ్రి తనయుని
మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ‖ 2x ‖