Verse
క్రీస్తు సిల్వ నాకు గొప్ప
యౌను, నేనుతింపుదు
సచ్చరిత్రు కాంతి యొప్ప
గాని జుట్టి యుండును
Verse
నాకు నే విచారమైన
భీతి యైన కల్గినన్
సిల్వ రూప మెందునైన
సంతసింప జేయునన్
Verse
మోక్ష సూర్య దైన కాంతి
నాదు త్రోవ బుట్టుగా
సిల్వనుండి కల్గు శాంతి
దాని నింపు చేయుగా
Verse
లాభ, లోభ, మోగు, బాగు
శుద్ధి యౌను సిల్వచే
సంతసంబు శాంతి జాగు
లేక కల్గునప్పుడే, ఆమేన్.