Verse
క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి
Verse
సూచనలు చూపుచున్నవి - వేచియుండుడి ఆయనకై
Verse
రక్షణ సంపూర్తిచేయుటకై - అక్షయుడేసు వచ్చును
అక్షణ పొందిన వారెల్లరు - తక్షణమే ఎత్తబడెదరు
Verse
పరిశుద్ధులందు మహిమ నొంద - పరమ యేసు వచ్చును
పరిశుద్ధులు వింతపడునట్లు - అరయునేసు వేగమే
Verse
మరుగైనవి బయలు పరచ - వరుడు యేసు వచ్చును
హృదయ ఆలోచనలెల్ల - సదయుడు బయలుపరచును
Verse
వేయేండ్ల పాలన చేయుటకై - రయముగ యేసు వచ్చును
సర్వరాజ్యములు అన్నియు - సర్వేశుడేసుని రాజ్యమగున్