Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthu Yoadhulaaraa Yuddha Maaduao

క్రీస్తు యోధులారా యుద్ధ మాడుఁ

Kreesthu Yoadhulaaraa Yuddha Maaduao

Lyricist: Nabeen Charing Cooled
Verse
క్రీస్తు యోధులారా
యుద్ధ మాడుఁడీ
క్రీస్తు సిల్వ మీరు
పట్టి గెల్వుఁడీ
మన రాజు క్రీస్తు
దండు నడ్పును
చూడు మాకు ముందు
క్రీస్తు ధ్వజము.‖ క్రీస్తు వీరులారా యుద్ధ మాడుఁడీ క్రీస్తు ధ్వజ మెత్తి జయ మొందుఁడీ ‖
Verse
లోక రాజ్య కీర్తి
వాడిపోవును
క్రీస్తు రాజ్యమైన
నిత్య ముండును
సాతా నాధిపత్య
మాఁగిపోవును
క్రీస్తు దివ్య సభ
జయ మొందును.
Verse
ఓ జనంబులారా
వచ్చి చేరుఁడీ
జయ కీర్తనంబు
లెత్తి పాడుఁడీ
కీర్తి, స్తుతి, ఘవ
మెన్నఁ డుండును
మన క్రీస్తు రాజు
నిత్య మేలును.

Related Tags

VictoryWarfare