Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthulaeche Hallelooya Laeche Jayasheeludu

క్రీస్తులేచె హల్లెలూయ లేచె జయశీలుడు

Kreesthulaeche Hallelooya Laeche Jayasheeludu

Verse
క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
చూచి మళ్ళీ తనకాంతి - హృదుల్ నాయనన్
చింతవీడి సంతసాన వంగి క్రీస్తునెదుట
Chorus
క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
Verse
క్రీస్తులేచె! మండలపు - చింతయంత తీరెను!
హర్ష ద్వార మొప్పదీసి - మళ్ళీ జీవ మొందెను
చావు నరకాలు మ్రొక్కి - దూతలెల్ల గల్వను
కోట్లు చుట్టు కాంతి గూడ - లేచెనిప్డు శూరుడు
Verse
క్రీస్తులేచె! నాటి వంత - యంత యంత మొందెను
నేడు గొప్ప హర్షమాయె - క్రీస్తు లేచినందునన్
శుద్ధ భూసమాధి తొలి - పంటను గల్గించెను
వింతగన్ సజీవుడాయె - బోయిమళ్ళి కన్పడెన్
Verse
క్రీస్తులేచె! నింక చావు! నరకాల భయము
లేనె లేదు! క్రీస్తు నందు నన్ని గెల్చినారము
మా భయాదులన్ని పోయి - శంకదిగులుంబాసె
నేడు పునరుత్థానంపు - దీవెనల నొందుదము

Related Tags

PraiseResurrectionEaster