Verse
క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది – జయముంది నాకు‖ 2x ‖
Verse
ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో‖ 2x ‖
ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ‖ 2x జయముంది ‖
Verse
నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు‖ 2x ‖
మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను‖ 2x జయముంది ‖
Verse
సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను‖ 2x ‖
సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను‖ 2x జయముంది ‖