Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kreesthunaayaka Nee Dhayaalini Keerthana

క్రీస్తునాయక నీ దయాళిని కీర్తన

Kreesthunaayaka Nee Dhayaalini Keerthana

Lyricist: Mikkili Namuyelu
Chorus
క్రీస్తునాయక నీ దయాళిని కీర్తనలుగా బాడుదున్ నేస్తుతులతోఁ దండ్రి
దేవుని నిత్యమును గొండాడుదున్‖ క్రీస్తు ‖
Verse
సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటకు నోరాడదు అలుకునొందక
స్వామి నీ ది వ్యాంఘ్రి చెంతను గూడుదు‖ క్రీస్తు ‖
Verse
నిమిషమైన ంబాయకెదలో నిన్ను నే స్మరియింతును అమితమౌ దేవా
ను క్రోశము హర్షముగ వర్ణింతును‖ క్రీస్తు ‖
Verse
యేసుప్రభు నా కాలమంతయు నేమఱక నీ నామము దాసునిగ
భజియంతు నిఁక నేఁ దప్పకుండను నీమము‖ క్రీస్తు ‖
Verse
చచ్చి నే నరుదెంచి మోక్షము స్వామి నీ యుపకారముల్ హెచ్చు
ప్రేమను బాడుచుందును యెప్పుడును గైవారముల్‖ క్రీస్తు ‖
Verse
మలినమౌ నా నత్తి నాల్క స మాధిలోఁ గృశియింపను బలిమితోనేఁ
బాడుచుందును భక్తి యుజ్వలింపను‖ క్రీస్తు ‖
Verse
కన్ను మూతలుగాను నీ సము ఖంబు కేను బిరాలను తెన్ను తప్పకవత్తు
శ్రీకర దేవ నను నీవేలను‖ క్రీస్తు ‖
Verse
ముగ్గురొకఁడై వెల్గుచుండెడి మోక్షరాజ్య గరిష్ఠుఁడా యొగ్గుచేయక
నన్నుఁ బ్రోవవే యేసునాధ మహేశుఁడా‖ క్రీస్తు ‖
Verse
భూతలములో నీ సమానముఁ బోల్చ నేదియుఁ గానము దాతవై మము
సలుపవే నీ తండ్రికిని సంధానము‖ క్రీస్తు ‖

Related Tags

PraiseWorshipJesus Christ