Verse 1
Reference: ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము హెబ్రీ. 12:1,2
Verse
క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - సీయోను యాత్రలో
లోకమున్ విడిచి చేరుకొందును మహిమ దేశమున్
క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో
మహానందముతో స్తుతించుచు చేరుదు నాదేశమున్
Chorus
ఎంతో సుందర జీవితము - మహిమతో నిండినది
సదా సర్వదా క్రీస్తుతో నుండి
మహిమ పరచెదను - మహిమలో నుండెదను
Verse
దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనే
సంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదను
ప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలో
ఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును
Verse
యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేను
స్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్
నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితో
తోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను