Verse
క్రీస్తుని నామము నిత్యము నిల్చున్
సూర్యుడున్నంత కాలము చిగుర్చున్
Verse
అతనినిబట్టి మానవులెల్లరు
తథ్యముగానే దీవించబడెదరు
Verse
అన్యజనులందరును అతని
ధన్యుడని చెప్పుకొను చుందురు
Verse
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
దేవుడు స్తుతింపబడును గాక
Verse
ఆయనే బహు ఆశ్చర్యకార్యములు
చేయువాడు గాన స్తోత్రార్హుండు
Verse
ఆయన మహిమగల నామము
నిత్యమును స్తుతింపబడును గాక
Verse
సర్వభూమి ఆయన మహిమచే
నిండియుండును గాక ఆమెన్ ఆమెన్