Verse
క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది‖ 2x ‖
Verse
యెహోవా నీ స్వరము జలములపై వినబడెను‖ 2x ‖
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను‖ 2x క్రీస్తుని ‖
Verse
బలమైన నీ స్వరము బహుప్రభావము గలది‖ 2x ‖
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని‖ 2x క్రీస్తుని ‖
Verse
అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును‖ 2x ‖
ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును‖ 2x క్రీస్తుని ‖
Verse
ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్‖ 2x ‖
ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే‖ 2x క్రీస్తుని ‖
Verse
నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్‖ 2x ‖
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు‖ 2x క్రీస్తుని ‖
Verse
నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును‖ 2x ‖
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను‖ 2x క్రీస్తుని ‖
Verse
నీ మధుర స్వరము నీ మార్గము జూపును‖ 2x ‖
కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును‖ 2x క్రీస్తుని ‖
Verse
తుఫానులు కలిగి భయభీతులలో నుండ‖ 2x ‖
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము‖ 2x క్రీస్తుని ‖
Verse
మరణాంధకార లోయలో నేనుండ‖ 2x ‖
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్‖ 2x క్రీస్తుని ‖
Verse
ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్‖ 2x ‖
దీనుడనై నీ మాట అంగీకరించెదను‖ 2x క్రీస్తుని ‖