Verse
పల్లవి: క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమే యది
Verse
యెహోవా నీ స్వరము జలములపై వినబడెను
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను
Verse
బలమైన నీ స్వరము బహుప్రభావము గలది
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని
Verse
అధ్భుత ప్రభుస్వరము అరణ్యము కదిలించును
ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును
Verse
ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్
ఆశీర్వాదము శాంతి నోసగు నాయన స్వరమే
Verse
నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు
Verse
నీ మధుర స్వరము నీ చత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను
Verse
నీ మధుర స్వరము నీ మార్గము జూపును
కుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును
Verse
తుఫానులు కలిగి భయభీతులలో నుండ
భయపడకు మని పలికే ప్రమగల నీ స్వరము
Verse
మరణాంధకార లోయలో నేనుండ
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్
Verse
ప్రభువా సెలవిమ్ము నీ దాసు డాలించున్
దీనుడనై నీ మాట అంగీకరించెదను